e hënë, 11 qershor 2007

నువ్వంటే నాకిష్టం


నువ్వంటే నాకిష్టం...
ఎంతంటే... ఇష్టమనే మాటే ఈర్ష్యపడేంత!
నువ్వంటే నాకిష్టం...
ఎంతంటే... నా ఇష్టమే నీకు విసుగుపుట్టి
అయిష్టమయేంత!
వెన్నెల వెలుగులో పరవశించే నా మనసు-
నీ కౌగిలినెంత కొరుతుందో...
అమావాస్య చీకటిలో బెదిరిపోయే నా మనసు-
నీ తోడుని అంతగానే కోరుతుంది!
నీ ప్రేమ నన్ను కవ్విస్తుంది... నవ్విస్తుంది...
కలహిస్తుంది... కొన్నిసార్లు కన్నీరు తెప్పిస్తుంది!...
ఒకరికొకరంగా-ఇద్దరం ఒక్కరిగా మసలిన మనం ఒకరికొకరం ఏమీకానట్టు
ఒకరూ-ఒకరూ ఎవరికి వారేనన్నట్టు
అలా చేశావేం దూరం..? నన్ను పరాయిగా చేశావేం..?
నీకోసం ... నీ ప్రేమకోసం... నీ చిన్ని నవ్వుకోసం...
అలమటించే నన్నిలా అనాధను చేశావేం..?
నీవల్లే సంతోషం... నీవల్లే ఆనందం...
నీతోనే ఆహ్లాదం... నీకోసమే ఆరాటం...
నీవల్లే నా జీవితానికో అర్ధమని
ఆశల పందిరి అల్లుకుంటుంటే
ఒకే ఒక్క మాటతో-ఒకే ఒక్క చూపుతో
గుండెను కోశావేం?
పదిలంగా నేనందించిన గుండెగులాబీని నేలరాల్చేశావేం?
'బ్లైండ్ రిలేషన్షిప్' అంటూ నా ప్రేమను ఎగతాళి చేశావేం?
నన్ను దూరం చేశావేం ప్రియా?
నీ మాటల తూటాలతో నా గుండెను తూట్లు పొడిచావేం ప్రియా..?!