
దైవాన్ని నమ్ముతాడు
జీవితానికి అర్థం తెలీదంటాడు
చాప కింద నీరులా
ప్రవహించాలని చూస్తాడు !
చెదపురుగుల మెదడుతో
అమాయకుడ్ని ముంచేస్తాడు
బలిపశువును ఎన్నుకుంటాడు
వెన్నుపోటుతో చరిత్ర సృష్ఠిస్తాడు !
మాటలతో- నవ్వులతో- చేష్ఠలతో
హృదయవీణతంత్రులు తెంపి పారేస్తాడు
కత్తులు వాడకుండా
గుండెను చీలుస్తాడు !
నిజాన్ని శవంగా మార్చి
కట్టుకథల ప్రవాహంలో
కొట్టుకుపోయేలా చేస్తాడు
జీవితాన్ని కాచి వడబోసినట్లుగానటిస్తాడు !
సంఘానికే అపాయం.. వాడు !
మోస్ట్ వాంటెడ్ పర్సన్..
పట్టిచ్చినవారికి
పదిలక్షల బహుమానం !
మనముందే ఉన్నాడు కాని
పోల్చుకోలేని అసమర్ధులం మనం !!






