e mërkurë, 21 nëntor 2007

మా తెలుగుతల్లికి(Latest version)...


మా తెలుగుతల్లికి సమస్యల దండ
మా కన్నతల్లికి కలహాల హారతులు !
కడుపులో కార్చిచ్చు.. కనుకొలనులో కన్నీరు
చిరునవ్వులో చితులు.. రగిలేను మా తల్లి !
రోజు రోజుకీ గోదారి కల్మషం అవుతుంటే
కృష్ణమ్మ నీటికై కొట్టుకుంటుంటే
బంగారు పంటలే ఎండినాయి..
మురిపాల ముత్యాలు మాసినాయి !
అమరావతీ నగర అపురూప శిల్పాలు
అంగవైకల్యమై నిలిచినాయి !
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
డిస్కోల హొరులో కలిసినాయి !
తిక్కయ్య కలములో తియ్యందనాలు
ఎక్కడికి పొయాయో ఆ తీపిరుచులు !
నిత్యమై, నిఖిలమై నిలచివుండుట లేదు !
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
పాశ్చాత్య తీరుతో మారినాయి !
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
కుటిల నేతల మధ్య కాలినాయి -
మా చెవున రోదనలు హొరుమంటున్నాయి !
నీ ఆటలే ఆడలేం..
మా తల్లి నీ పాటలే పాడలేం !
జై కొట్టలేమమ్మ.. జై కొట్టలేం..
జై కొట్టలేమమ్మ.. జై కొట్టలేం !!